Top Videos

header ads

బెస్ట్ పవర్ ఫుల్ మార్నింగ్ మోటివేషన్ టాపిక్ ఇన్ తెలుగు

ఇది చదివితే ఇంక రోజు 5:00 కి లేస్తారు

 ప్రతి ఉదయం ఇది చదవండి తెలియని శక్తి వస్తుంది :

 బెస్ట్ పవర్ ఫుల్ మార్నింగ్ మోటివేషన్ టాపిక్ ఇన్ తెలుగు ;

"Read to these affirmations every day to overcome failure and fear ,every word in this topic will give you the motivation you need for a complete day have a great day"


Hai friends how are you?



                         నిద్ర నుంచి లేచిన వెంటనే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. కానీ మన పనులు మనం మునిగిపోయే పాటికి చెడు ఆలోచనలు, కష్టాలు,బాధలు, ఏడుపులు వాళ్ల వీళ్ల చాడీలు వీటితో మన ఆలోచనలు మారిపోతాయి. కానీ ఒక్కటి ఇప్పుడు మర్చిపోకండి, ఎప్పుడూ కూడా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు అని కాదు ప్రేమించే వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీకు అర్థం కాదు, మీకు ఉండే రేపు రాబోయే లాభాలను కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడు బాధ నేను కాదు మీరు అనుభవించిన సుఖాలని కూడా గుర్తు చేసుకోండి. నీ కంట్లో నుంచి జారిన కన్నీరు కాదు నీ మూతి మీద చిగురించిన చిరునవ్వుని గుర్తు తెచ్చుకోండి. మీకు కావాల్సిన వాళ్లు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అంతే ప్రేమతో మీకు కావాల్సిన వాళ్ళని కూడా ప్రేమించండి. అప్పుడు జరిగే అద్భుతాలను మీ జీవితంలో బ్రతికున్నంత కాలం మీరు గుర్తుతెచ్చుకుంటూ నే ఉంటారు.

"YOU CAN NOT CHANGE THE WORLD BUT YOU CAN PRESENT THE WORLD WITH ONE IMPROVED PERSON YOURSELF "

 ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చలేక పోవచ్చు కానీ ఈ ప్రపంచానికి మారి ఒక్క గొప్ప వ్యక్తిని వ్యక్తిని పరిచయం చేయవచ్చు అతను ఎవరో కాదు నువ్వే. నీ గతంలో నువ్వు ఎలా ఉన్నా కూడా ఇప్పటినుంచి నువ్వు ఎలా ఉన్నావో అదే నువ్వు. నీ మీద నీ ఆలోచనల మీద నువ్వే పనిచేసి నిన్ను నువ్వు మార్చుకో. నీకు నీ మీద గౌరవం మంచి ఆదర్శం ఉన్న వ్యక్తిగా నిన్ను నువ్వు మార్చుకో. నిన్ను నువ్వే ఒక ICON ల మార్చుకొని వేరే వాళ్ళకి ఆదర్శంగా అందర్నీ గైడ్ చేయగల దిక్సూచి గా నిన్ను నువ్వు మార్చుకో. అందర్నీ గాయపరిచేలా కాకుండా అందరికీ ఉపయోగకరంగా నిన్ను నువ్వు మార్చుకో. నీ మీద నీకు పూర్తి స్పృహతో మంచి డిసిప్లిన్ తో మంచి పాజిటివ్ మాటలతో నిన్ను నువ్వు మార్చుకో. ఇలా నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం నువ్వు కనుక చేస్తే నిన్ను ఎవరో అక్కర్లేదు నిన్ను నువ్వే మార్చుకున్న ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మారతావ్.


 నీ కల ఏమిటి?




  •  నీ కలలో నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావ్.

  •  కళ లేదు ఏమీ లేదు అలాంటిది నాకు ఏమీ లేదు అని మీరు అనుకుంటే, ముందు నువ్వు ఒక కలగను.

  •  ఎప్పుడైతే నువ్వు కల కంటావో అప్పుడు నిన్ను నువ్వు ఒక అత్యుత్తమ స్థాయిలో చూసుకుంటావ్.

  •  ఆ తర్వాత నీ కల కోసం నేర్చుకో నీ కలకి ఏమి కావాలో అది వదలకుండా నేర్చుకో.

  •  ఎప్పుడైతే అలా నేర్చుకుంటా వో నీ కలల కోసం నువ్వు ముందుకు వెళ్ళడం మొదలు పెడతావు.


 లక్ష్యం ;



 ఎప్పుడు నీకంటూ ఒక లక్ష్యం పెట్టుకో, ఎప్పుడైతే నీ కట్టు ఒక గోల్ పెట్టుకుంటావో ఆ గోల్ ని సాధించాలన్న తపన నీలో పెంచుకుంటావ్. నువ్వు ఒక బలమైన సంకల్పని ఇప్పుడే తీసుకో. ఎప్పుడైతే నీకు బలమైన సంకల్పం ఉంటుందో ఎలాంటి గెలుపు నైనా నువ్వు సాధిస్తావ్.


 నమ్మకం ;




 నీ మీద నీకు నమ్మకం పెంచుకో ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని పెంచుకుంటావో నీళ్లు అత్యంత బలమైన ఆత్మ ధైర్యాన్ని నువ్వు పెంచుకుంటావ్.

 నిన్ను ప్రేమించు కో ఎప్పుడైతే నీకు నీ ప్రేమ అందుతుందో అప్పుడు నీకు కూడా వేరే వాళ్ల దగ్గర నుంచి అదే ప్రేమ అందుతుంది.

 ప్రేమ, ధైర్యం, ఆత్మధైర్యం, సంకల్పం ఇవన్నీ కూడా నిన్ను THE MOST POWERFUL PERSON గా మారుస్తాయి.


ఓటమి ;




 మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారు దాన్ని దక్కించుకుంటారు. ఏదైతే అవ్వాలనుకుంటున్నారు అది మీరు అవుతారు. మీరు ఏదైతే బలంగా నమ్మురో ఆ నమ్మకమే మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడి దాకా రప్పించింది. మీ నిర్ణయాలు నీ ఆలోచనలే మీరు ఇప్పుడు ఉన్న స్థాయిని నిర్ణయించాయి. అలాగే మీ నిర్ణయాలు మీ ఆలోచనలను మార్చుకునే శక్తి మీలోనే ఉంది. ఆ శక్తితోనే మీ స్థాయిని ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు అనుకున్న స్థాయిలో మీరు లేరు అంటే దానికి కారణం ఎవరో కాదు మీరే. మీ ఆలోచనలే మీ జీవితం మీద మీకున్న ఆ దృష్టి (vision). ఎందుకంటే నీకు ఒకటి కావాలి అనే నమ్మకం బలంగా ఉంటే నీకు అది దక్కి తీరుతుంది నీకు బలంగా లేకపోతే అది ఎంత కష్ట పడినా దక్కదు.

 మీరు కోటీశ్వరులు కావాలంటే దానికి తగ్గ నిర్ణయాలు ఆలోచనలు చేయడం మొదలు పెట్టండి.

 లేదు నేను ఈరోజు టివి ముందే ఉండిపోవాలంటే అలాంటి ఆలోచనలే చెయ్యండి.

 ఒకటి ఎప్పుడు మర్చిపోకండి " నిర్ణయం మాత్రం నీ చేతుల్లోనే ఉంది ".

 ఇప్పుడు మీ మైండ్ లో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది

 ప్రయత్నిస్తే ఓడిపోతాను మరి నన్ను ఏం చేయమంటారు?

 దీనికి ఒక ఉదాహరణ ఉంది.


 ఉదాహరణ ;


1984 "అటల్ బిహారీ వాజ్పేయ్" గారు Gwalior. ఆయన పుట్టిన ఊరు నుంచి ఎంపీ సీట్ కి పోటీ చేస్తారు. ఒకప్పటి Gwalior క్వీన్ అయినా రాజమాత" విజయరాజి షిండే " కూడా వాజ్పేయ్ కి సపోర్ట్ చేసింది. విజయం తథ్యం అనుకున్న సమయంలో నామినేషన్ చివరి రోజుల్లో అదే రాజమాత కుమారుడు మాధవరావు సింగ్ డే ను వాజ్పేయికి ఆపోజిట్ గా నిలబెట్టారు. ఇది ఊహించని వాజ్పేయి తన సొంత ఊర్లో ఘోరమైన పరాజయం చూశారు. అందరూ వాజ్పేయి ని ఇతను ఎలక్షన్ కూడా గెలవలేడు ఇతను పార్టీ ప్రెసిడెంటా అన్నారు.  ఎవరైనా సరే ఈ సిచువేషన్ లో ఓటమి ఒప్పుకుంటారు, ఓటమికి కృంగి పోతారు, అన్ని వదిలేసి పారిపోతారు. వాజ్పేయి కూడా ఓటమిని ఒప్పుకున్నారు బాధ్యత తీసుకున్నారు. అన్నీ వదిలేసి పారిపోలేదు. తర్వాత మన దేశానికి మూడు సార్లు  PRIME MINISTER గా పనిచేసాడు. ఓటమి కారణం చూపి తన ఆశయాన్ని తన కోరికని వదులుకోలేదు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్న ఆయన గర్వంగా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు.

 అందుకే ఆయన అంటాడు నేను ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోను కొత్త నిర్ణయాలు నేనెప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. సమయం మీద నా రాత రాస్తాను చేరిపేస్తాను ఎప్పుడు కొత్త పాట పాడుతూనే ముందుకు వెళ్తాను.

అందుకే మనకు వచ్చే ఓటమి మన గతిని మన గమనాన్ని మార్చకూడదు. ఓటమి నుంచి పాఠం నేర్చుకోని సరికొత్త ఉత్తేజంతో ఇంకా పైకి లేచే నిర్ణయాలు మనం కూడా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే గెలవడం కోసం కావాల్సిన ఆలోచనల్ని చేయండి.

 ఓటమి అనేది నీకు లేదు, ఎందుకంటే బలమైన సంకల్పం ఉన్న వ్యక్తికి ఓటమి అనేది ఉండదు. నీకు ఏం కావాలో దాన్ని మీరు బలంగా నమ్మండి. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది దాన్ని మీరు దక్కించుకుని తీరుతారని. అందుకే సోదరా ఈరోజు ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేసేయ్ వాయిదా వేస్తే దారుణాలు జరుగుతాయి.

 సాధించాల్సింది ఏమైనా ఉంటే నిద్రపోకుండా దానికోసం ఇప్పుడే తపించు బాగా ఆలోచించు పొరపాటున నువ్వు దాన్ని వదిలేస్తే నీకు నీ మీద నమ్మకం కోల్పోయి అవకాశాలు చాలా ఉన్నాయి మిత్రమా. రా చెప్పు నాతో కలిసి చెప్పు  ఇప్పుడే చెప్పు నవల అవుతుంది అని బలంగా చెప్పు చుట్టుపక్కల ఉన్న ప్రపంచానికి వినిపించేలా చెప్పు ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే ఎప్పటికీ నీవల్ల కాకపోవచ్చు. నీకు ఉంది ఈ నిమిషమే ఈ నిమిషం మాత్రమే నీది. నిర్లక్ష్యం చేసి ఈ నిమిషాన్ని నువ్వు వదిలేస్తే గుర్తుంచుకో మీ దరికీ ఎప్పటికీ రాదు ఈ నిమిషం. అందుకే ఇప్పుడే పని చేయడం మొదలు పెట్టు ఇప్పటి నుంచే నీకు నువ్వు కావాల్సింది సాధించడం మొదలు పెట్టు రేపు ఉంది లే అని అనుకోవద్దు ఈరోజు నీ చేతిలో ఉంది ఈరోజు మాత్రమే నీ చేతిలో ఉంది.

 మరి నీ దమ్ము ఏంటో చూపించు…..

 భయం ;



 మనం ముందుకు వెళ్లక పోవటానికి ముఖ్య కారణం భయం

 నువ్వు భయపడకు ఎప్పుడు భయపడకు అప్పుడప్పుడు తప్పులు పొరపాట్లు జరుగుతాయి మనం వెళ్లాల్సిన దారి కష్టంగా ఉంటుంది. మనకు ఆస్తి తక్కువ అప్పులు ఎక్కువ ఉండవచ్చు. ముఖంపైన చిరునవ్వు చూడాలి అనుకునే వాళ్లు మీకు లేకపోవచ్చు. ప్రస్తుతం కష్టాలని నీ మీద భారాన్ని పెంచవచ్చు కావాలంటే ఆగు విశ్రాంతి తీసుకో కానీ నావల్ల కాదు అని మాత్రం అనకు. మీ గమ్యానికి ఎంత దగ్గరగా ఉన్నావో నీకు తెలియదు చాలా దూరంలో ఉంది అని నువ్వు అనుకుంటున్నాను కానీ నీకు నిజంగా నీ గమ్యం ఎంత దగ్గరగా ఉందో నీకు నిజంగా తెలియదు. నన్ను నమ్ము నువ్వు ముందుకు వెళ్తూ యుద్ధం లో ని పూర్తి బలాన్ని చూపించు. ప్రతి కష్టాన్ని దిక్కరిస్తూ ముందుకు వెళ్ళు సంపూర్ణ విజయాన్ని అందుకున్న మహోన్నత వ్యక్తి గా నిలబడు.


THE DAY IS YOURS;[ ఈ రోజు నీ రోజు ]


ఈ రోజు నీకు చాలా స్పెషల్,ఈ రోజు నీకు చాలా ముఖ్యం. నీ ఇన్స్పిరేషన్ ఏంటో నువ్వే తెలుసుకో నీ మోటివేషన్ని నువ్వే పెంచుకో. నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చేసుకో నీ ముందు నుంచున్న కష్టాలు అన్ని కూడా స్లో గా కాలగర్భంలో కలిసి పోతుంటాయి. నీ వల్ల ఏమి కాదు అనేవారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఇది ముందు నువ్వు తెలుసుకో. నీ మీద నమ్మకం ఉంది అనే వారి చేతులు నీ భుజం తాడుతాయి నీ గుండె ధైర్యం నీ మెదడుకి పదును పెరుగుతుంది. నీకు అసలు ఎదురేలేదు నిన్ను ఆపేవాడు లేడు అన్న ఆలోచనలు పుడతాయి. అది ఈ రోజే సాధ్యం, అది ఈ ఈ రోజే సాధ్యం. మరి ఈ రోజు ఏం చేస్తావ్ మర్చిపోకు మిత్రమా ఈ రోజు నీ చేతుల్లో ఉంది ఎప్పటికీ మర్చిపోకు….

 

"Without struggle there is no success"


జై హింద్!!!


Post a Comment

0 Comments